నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ

268చూసినవారు
నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ
రాజమహేంద్రవరంలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ప్రధానకార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఇరు పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు మధ్యాహ్నం 3 గంటలకు మంజీర హోటల్లో భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా విజయదశమి రోజున టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించగా ప్రస్తుతం ఆయన జైలులో ఉండటంతో అది సాధ్యపడలేదు.

సంబంధిత పోస్ట్