కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. ఇందులో కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్