మాజీ సీఎం జగన్ హయాంలో అమలైన లిక్కర్ పాలసీపై బుధవారం మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో మాట్లాడారు. వారి దోపిడీకి అనుకూలంగా లిక్కర్ పాలసీ సిద్ధం చేసుకున్నారన్నారు. వైసీపీ హయాంలో విక్రయించిన లిక్కర్ కారణంగా ప్రజారోగ్యం దెబ్బతిందని, రాష్ట్రం ఆదాయం నష్టపోయిందన్నారు. మద్యపాన నిషేధం చేసి 2024లో ఓట్లడుగుతానన్న జగన్. అధికారంలోకి వచ్చిన అనంతరం మాట తప్పాడని కొల్లు చెప్పారు.