NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని మోడీ విశాఖ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోడీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్ షో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వరకు జరగనుంది.