సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తాండలో తుఫాన్ కారణంగా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సర్పంచ్ అంజి నాయక్ గురువారం వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు. గ్రామంలో ట్యాంకులు క్లీన్ చేయడంతో పాటు కుళాయిలు లేని చోట టాప్స్ ఏర్పాటు చేశారు. ప్రజలు సర్పంచ్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.