తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.