క్రమం తప్పకుండా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని బుధవారం ఆదేశించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గౌరయ్య కాలనీలో జరుగుతున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు.