గుంటూరు జిల్లా తెనాలిలో ఓ పోలింగ్ సెంటర్లో ఘర్షణ నెలకొంది. క్యూలైన్లో ఉండకుండా నేరుగా ఎందుకు వెళ్లారని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓ ఓటర్ నిలదీశాడు. కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే.. సదరు ఓటర్‌పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు ఓటర్‌పై దాడి చేశారు.