మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు

71చూసినవారు
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్‌ కంపాస్‌లా పనిచేస్తుందని తెలిపారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 52 మంది వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. కంప్యూటర్‌ తెరలపై వెలువడిన మార్గదర్శకాలకు అనుగుణంగా తలలను తిప్పాలని వారికి సూచించారు. ఈ కదలికలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారు తల తిప్పడానికి ముందే అది బుర్రలో ప్రత్యక్షమైందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్