ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో రాబోయే 5 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం నుండి శుక్రవారం వరకు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో యూపీలోని కొన్ని ప్రాంతాలలో కూడా తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయంది. మరోవైపు ఈ వారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.