సామ్ అంటోన్ దర్శకత్వంలో హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం 'బడ్డీ'. కొలీవుడ్లో వచ్చిన 'టెడ్డీ' మూవీకి రీమేక్‌గా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పాట అభిమానులను అలరించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.