LIVE VIDEO: చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా

69చూసినవారు
చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలివైపున ఉన్న మట్టి నమూనాల్ని చైనా ఈరోజు భూమికి తీసుకొచ్చింది. ఆ దేశ లూనార్ ల్యాండర్ చాంగే-6 మంగోలియాలో ల్యాండ్ అయింది. ఈ ఏడాది మే 3న బయలుదేరిన చాంగే-6, ఈ నెల 2న చంద్రుడికి అవతలివైపున ల్యాండ్ అయింది. అక్కడి నమూనాల్ని సేకరించి తిరిగి నేడు భూమిపైకి చేరుకుంది. ఈ నమూనాల ద్వారా చంద్రుడి ఉపరితలం గురించిన కొత్త అంశాలు తెలుస్తాయని చైనా పరిశోధకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్