సమ్మెకు సిద్ధమైన అమెజాన్ ఉద్యోగులు

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు ముందు బ్రిటన్ వేర్ హౌస్ వద్ద వేతన వివాదంపై ఈ-కామర్స్ కంపెనీ ఉద్యోగులు 3 రోజుల సమ్మెకు సన్నద్ధమయ్యారు. జులై 11 నుంచి 13 వరకూ సమ్మె చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రైమ్ డే సేల్ ఈవెంట్ ప్రారంభం సమయంలోనే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెలో 900 మంది వర్కర్లు పాల్గొంటున్నారని కార్మిక సంఘం జీఎంబీ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్