అయిదు నెలల చిట్టి పాప తన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్నారి ప్రతిభను ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ’ గుర్తించి తమ రికార్డ్స్‌లో చోటు కల్పించి పతకాన్ని అందజేసింది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనూజలు దంపతులు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి అయిదు నెలల కుమార్తె ఉంది. పాపకు వివిధ రకాల మొక్కలు చూపిస్తూ వాటి పేరు చెప్పినా వెంటనే ఫ్లాష్‌కార్డ్ ఆల్బమ్‌లో వాటిని ఇట్టే గుర్తిస్తోంది.