తెలంగాణలోనే ఏకైక త్రిలింగ క్షేత్రం.. ఎక్కడంటే?

69460చూసినవారు
తెలంగాణలోని అరుదైన శివాలయాల్లో త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి. రాజన్న సిరిసిల్ల(D) బోయిన్ పల్లి (M) విలాసాగర్ గ్రామంలో కాకతీయుల కళావైభవాన్ని ప్రతిభింభించేలా అద్భుత శిల్పకళా కట్టడంతో అలరాలుతున్న దివ్య క్షేత్రం ఇది. తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో మూడు శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. త్రిలింగేశ్వరుడికి కుడివైపున అమ్మవారు, ఎడమవైపున విఘ్నేశ్వరుడు ఉంటారు. ఇక్కడ మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్