చైనాలోని జెంజియాంగ్ నగరంలో ఈ నెల 23న ఓ షాపింగ్ సెంటర్ ఫ్లోర్ అకస్మాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఓ మహిళ షాపింగ్ కోసం వచ్చి, ఫ్లోర్‌తో పాటు కింద పడిపోయింది. ఇక ఫ్లోర్ కూలిపోయే సమయంలో ఓ భవన నిర్మాణ కార్మికుడు కింద ఉన్నాడు. అతడికి సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను షాపింగ్ మాల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.