ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 15.88 శాతం వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకూ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.88 శాతం వృద్ధి చెందాయి. 2024 ఏప్రిల్‌ నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ సుమారు రూ.16.90 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. గతేడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 12 వరకూ నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు సుమారు రూ.7.68 లక్షల కోట్లు అని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్