సంక్రాంతి పండుగ వేళ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భారీ తగ్గింపు ధరలు చూపించి మోసం చేస్తారని చెప్పారు. గిఫ్ట్‌కార్డు మోసాలు, ఫేక్ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, QR కోడ్‌లు ఉపయోగిస్తారని చెప్పారు. సైబర్ క్రైం బాధితులు వెంటనే 1930కి కాల్/ cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలన్నారు.