పవర్ కట్తో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు దంచి కొడుతున్న ఎండలకు కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమవుతున్నారు. రాత్రి పూట కరెంట్ కోతతో నిద్ర కరువవుతోంది. పెరుగుతున్న ఎండ వేడిమికి విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ పై ఆధారపడి జీవిస్తున్న ఫ్రూట్ జ్యూస్ షాపులు, చెరకు రసం బండ్లు, ఎలక్ట్రికల్, వెల్డింగ్ షాపుల వారు తమ ఉపాధి దెబ్బతింటోందని వాపోతున్నారు.