పంజాబ్‌లో మరోసారి డ్రోన్ కలకలం

54చూసినవారు
పంజాబ్‌లో మరోసారి డ్రోన్ కలకలం
లోక్‌సభ ఎన్నికల వేళ డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. తాజాగా పంజాబ్‌ అమృత్‌సర్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో హెరాయిన్‌ ప్యాకెట్‌తో కూడిన చైనా తయారీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా సోదాలు నిర్వహించి డ్రోన్‌తో పాటు 520 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్‌ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ను చైనా తయారీ డీజేఐ మావిక్ 3 క్లాసిక్‌గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్