ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి

కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు కావేరి నదిలో దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు విగతజీవులుగా మారారు. రామనగర జిల్లా కనకపురలో మేకెదాటు వద్ద కావేరీ నది సంగమంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించారు. మృతులను హర్షిత (20), అభిషేక్ (20), తేజస్ (21), వర్ష (20), నేహా (19)గా గుర్తించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్