ఓయూలో నీటి కొరత.. జలమండలి క్లారిటీ

58చూసినవారు
ఓయూలో నీటి కొరత.. జలమండలి క్లారిటీ
ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని వస్తున్న వార్తలపై జలమండలి క్లారిటీ ఇచ్చింది. వర్సిటీకి ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన దానికంటే ఎక్కువే సరఫరా చేస్తున్నామని పేర్కొంది. జలమండలి ఉన్నతాధికారులు సంబంధిత ఏఈతో కలిసి క్యాంపస్ ను సందర్శించారని, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరం అయితే మరింత నీరు సరఫరా చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్