ఈ ఐపీఎల్లో వర్షంతో 3 లీగ్ మ్యాచ్‌లు రద్దయిన సంగతి తెలిసిందే. మరి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే? దీనికి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో Q1, Q2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకూ రిజర్వ్ డే ఉంది. అలాగే మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లకు అయితే ఇది 60 నిమిషాలే. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ జరగకపోతే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ముందుకెళ్తుంది.