గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయం సమీపంలో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉండటం చూసి, ఆ ప్రాంత వాసులు 108, 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు 108 అంబులెన్స్ చేరుకొని అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఛాతిపై శ్రీనివాస్ గౌడ్ అనే పచ్చ బొట్టును పోలీసులు గుర్తించి సంఘటనపై విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్