నేడు 'పరుగుల రాణి' పి.టి. ఉష పుట్టిన రోజు

అసలు అమ్మాయిలు బయట అడుగుపెట్టడమే గగనం అనుకునే రోజుల్లో అథ్లెటిక్స్‌ సూట్‌ ధరించి. ప్రపంచ వేదికలపై పరుగు పందెంలో పతకాలు సాధించి.. భారత పతకాన్ని రెపరెపలాడించారు. పలు వేదికలపై జరిగిన ఆసియా క్రీడల్లో 23 పతకాలను సాధించారు. అంతేకాకుండా 1984 ఒలింపిక్స్‌లో వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయినా అథ్లెటిక్స్‌లో భారత్‌ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇలా పరుగు పందెంలో తనదైన పేరు లిఖించున్న ఈ పయ్యోలి ఎక్స్‌ప్రెస్, పరుగుల రాణి పి.టి ఉష పుట్టిన రోజు నేడు.

సంబంధిత పోస్ట్