తెలంగాణలోని హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షం కారణంగా మాదాపూర్ టి-హబ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ రద్దీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నైట్ మూడ్ లో IT హబ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.