ఆసిఫాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు, వర్షంలోనే ఎన్నికల సామగ్రితో సిబ్బంది వెళ్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.