రూ.2 లక్షల రుణమాఫీ.. ఎల్లుండి మార్గదర్శకాలు?

తెలంగాణలో రూ.2 లక్షల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని, వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎలాంటి మార్గదర్శకాలు వెలువడుతాయనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్