డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

56చూసినవారు
డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న డీఎస్సీకి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారంతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్