స్వీట్స్‌ని ఇష్టపడని వారుండరు. సహజ పదార్థాలతో స్వీట్స్ చేసుకుంటే రుచితోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వీట్స్ తయారీకి తృణధాన్యాల పిండి, బాదం, కొబ్బరిపిండిని ఉపయోగించాలి. చక్కెరకు బదులు తేనె, ఖర్జూరం, ఎండిన పండ్లు, బెర్రీలు, యాపిల్, అరటిపండు కలుపుకోవాలి. పోషక విలువలు పెంచేందుకు చియా, అవిసె గింజలు చేర్చుకోవచ్చు.