TG: ఇందిరమ్మ గరీబీ హఠావో నినాదంతో పేదల గుండెల్లో కొలువయ్యారని, అలాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. దాని కోసమే హౌసింగ్ శాఖను పునురుద్ధరించామని పేర్కొన్నారు.