కులగణనలో 39,973 మంది టీచర్లు.. ఒంటి గంట వరకే స్కూళ్లు

తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వే‌లో 80వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో దాదాపు 40 వేల మంది స్కూల్ టీచర్లు పాల్గొంటున్నారు. మూడు వారాల పాటు సాగే
సర్వేలో మొత్తం 36559 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు పాల్గొననున్నారు. దీంతో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి.

సంబంధిత పోస్ట్