హైడ్రా రంగనాథ్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు

63చూసినవారు
హైడ్రా రంగనాథ్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అమీన్‌పూర్ బాధితులు ఫిర్యాదు చేశారు. సర్వే నం.6 అనుమతులు చూపించి సర్వే నెం.12కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను మాధ‌వ‌రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌, కోటేశ్వ‌ర‌రావు అనే వ్యక్తులు మోసం చేశారని చెప్పారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన రంగనాథ్.. ప్రభుత్వ భూమిలో పూర్తి సర్వే చేయించి బాధితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్