కంకర వేశారు... బీటీ రోడ్డు మరిచారు

బొంరస్ పేట మండలం ఏర్పుమల్ల గ్రామం నుండి బాపల్లి తాండ శివారులోని సిత్యా నాయక్ తండ వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపివేశారు. రోడ్డు మొత్తం కంకర వేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టూ వీలర్ వాహనం వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని వాహనదారులు శుక్రవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్