ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లోని పాంటీప్రిడ్లో బెస్ట్ వన్ ఆఫ్-లైసెన్స్‌లో అన్నే హ్యూస్ (71) అనే ఓ మహిళా క్లినర్ గత సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ షాపు షర్టర్ వద్ద క్లీన్ చేస్తుంది. ఇంతలో షాపు యజమాని షాపు ఓపెన్ చేయడానికి ఆటోమెటేడ్ షట్టర్ మిషన్ ఆన్ చేశాడు. దీంతో షట్టర్‌తోపాటు ఆమె కూడా పైకి వెళ్లిపోయి గాల్లో తలకిందులుగా వేలాడుతూ అక్కడే ఉండిపోయింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.