AP: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. YCP హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న వంశీ పీఏ రాజా సహా 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది.