టీచర్‌పై విద్యార్థుల దాడి కేసు.. విస్తుపోయే అంశాలు?

70చూసినవారు
టీచర్‌పై విద్యార్థుల దాడి కేసు.. విస్తుపోయే అంశాలు?
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థుల దాడిలో టీచర్ ఏజాష్ అహ్మద్(42) మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. 9వ తరగతి చదివే కవల పిల్లలు దాడి చేయడంతో టీచర్ కుర్చీలోనే ప్రాణాలు విడిచారు. అయితే కవలలో ఒకరు తన చేతి కడియంతో దాడి చేయడంతో ఆయన కంటికి గాయమైంది. వీరికి దురలవాట్లు ఉన్నాయని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే మరణానికి కారణం తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్