కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా, మీరు కథ సిద్ధం చేస్తే.. చేస్తానని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. గురువారం కాకినాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మోక్షజ్ఞ కథానాయకుడిగా ఆదిత్య 999కు మీరు దర్శకత్వం వహిస్తారా అని మరొకరు ప్రశ్నించగా ఆదిత్య 369 సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు కదా.. అంటూ నవ్వేశారు. సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు డాకూ మహారాజ్‌గా వస్తున్నానని బాలకృష్ణ అన్నారు.