AP: విశాఖపట్నం వన్‌టౌన్ పీఎస్ పరిధిలో 12 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరికి స్థానికంగా వాడమదుల జోగారావు (45) అనే వ్యక్తి నివసిస్తుంటాడు. బాధితురాలు తరచూ జోగారావు ఇంటికి ఆడుకోవడానికి వెళ్తుంటుంది. ఎప్పటి నుంచో బాలికపై కన్నేసిన జోగారావు రెండు రోజుల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక తీవ్ర మంటతో బాధపడుతుంటే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అత్యాచారానికి గురైందని వైద్యులు నిర్ధారించారు. జోగారావు పరారీలో ఉన్నాడు.