TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు(డిసెంబర్ 7) హైదరాబాద్ రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నిరసనగా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మీటింగ్ లో '6 అబద్ధాలు.. 66 మోసాలు' అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్, ముఖ్య నేతలు కూడా హాజరవనున్నారు.