154 మంది గర్భిణీలను ఆస్పత్రికి తరలింపు

77చూసినవారు
154 మంది గర్భిణీలను ఆస్పత్రికి తరలింపు
విజయవాడలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో నెలలు నిండిన గర్భిణులు చిక్కుకున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఓ గర్భిణీ వరద ప్రవాహంలోనే కష్టంగా నడుస్తున్న ఓ ఫోటో గుండెల్ని పిండేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఇళ్లలో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలిచారు. 10 రోజుల్లో డెలివరీ అయ్యే 154 మందిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్