కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారి పెద్ద అల్లుడు, రామచంద్రయ్య గారి కుమారుడు చెన్నంశెట్టి విష్ణుస్వరూప్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. గురువారం మాజీ విద్యాశాఖ మంత్రి, వైసీపి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కడపలోని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గారి నివాస గృహానికి వెళ్లారు. సి రామచంద్రయ్య, కదిరి బాబురావు లను పరామర్శించారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ఇరువురిని ఓదార్చారు. విష్ణు స్వరూప్ అకాల మరణం పట్ల సంతాపం తెలియజేశారు.