నూతన సంవత్సర వేళ (2025 జనవరి 1తో).. ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకోనుంది. 2024లో జనాభా 7.1 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు గణాంకాలను 'యూఎస్ సెన్సస్ బ్యూరో ఎస్టిమేట్స్' విడుదల చేసింది. 2023లో పెరిగిన 7.5 కోట్ల మందితో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల శాతం (0.9) స్వల్పంగా నమోదైంది. 2025 జనవరిలో సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు సంభవించనున్నాయి. అమెరికా జనాభా జనవరి ఒకటికల్లా 34.1 కోట్లకు చేరనుంది.