AP: 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన PET, PMT పరీక్షలు గురువారంతో ముగిశాయి. 69 వేల మంది హాజరు కాగా, దాదాపు 39 వేల మంది అర్హత సాధించినట్లు PRB ఛైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. ఈ పోస్టులకు 2023 FEBలో 4.90 లక్షల మంది ప్రాథమిక పరీక్ష రాశారు. అర్హత సాధించిన వీరికి MAR, APR నెలల్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోంగార్డుల రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు.