ఎలాంటి అంచనాలు లేకుండా 2021లో విడుదలై ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది ‘స్క్విడ్ గేమ్’ వెబ్‌సిరీస్. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘స్క్విడ్ గేమ్ 2’ గతేడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. సీజన్ 3 విడుదలపై హింట్ ఇస్తూ వచ్చిన ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 27న ‘స్క్విడ్ గేమ్ 3’ని తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.