రహదారిపై చిరుతపులి మృతి (వీడియో)

53చూసినవారు
TG: రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో జరిగింది. NH-44 రహదారి దాటుతున్న సమయంలో చిరుతను ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నడుముతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో అది రోడ్డు మధ్యలో ఉండిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌ను కొద్దిదూరం వెంబడించింది. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో రోడ్డుపైనే చిరుత చనిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్