రేపు మంగళగిరి కోర్టుకు లోకేశ్‌

84చూసినవారు
రేపు మంగళగిరి కోర్టుకు లోకేశ్‌
ఏపీ మంత్రి నారా లోకేశ్ రేపు (శుక్రవారం) మంగళగిరి కోర్టుకు హాజరు కానున్నారు. గతంలో తనపై అసత్య ప్రచారాలు చేసిన పలు మీడియా సంస్థలపై ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు లోకేశ్‌ కోర్టుకు వెళ్లనున్నారు. లోకేశ్ రాక సందర్భంగా మంగళగిరి కోర్టు పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్