అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో 75 క్యాంటీన్లను సెప్టెంబర్ 13న ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మిగతా వాటిని అక్టోబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. 'సీఎం 100 రోజుల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 క్యాంటీన్లను ప్రారంభించారు. మొత్తం 203 క్యాంటీన్లలో 202 రెడీ చేశారు. కానీ ఫుడ్ సప్లై చేసేవారు కిచెన్‌ల ఏర్పాటుకు సమయం అడిగారు' అని చెప్పారు.