కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు

60చూసినవారు
కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు
ఏపీలోని నెల్లూరులో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు కాలేషా అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అమ్ములు.. తాను ప‌ని చేసే చేప‌ల దుకాణానికి కుమారుడిని కూడా తీసుకెళ్తూ ఉండేది. ఈ నెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. అక్క‌డ పెట్రోల్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకొని తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని ఆస్ప‌త్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్