సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడితే మంత్రి మండలి ఆమోదంపై చర్చించనున్నారు. ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై మంత్రులు మాట్లాడనున్నట్లు సమాచారం.